కూటమి ప్రభుత్వంతోనే గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ది జలదంకి లో జన ప్రభంజనం
జలదంకి మేజర్ న్యూస్ : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధి పనులే స్థానిక ఎన్నికల్లో మనల్ని గెలిపిస్తాయని, కూటమిపాలనలో పల్లెల్లో ప్రగతి వెలుగులు కనిపిస్తున్నాయని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఆదివారం అయిన జలదంకి మండలంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో మహిళలు, నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేకు ఆత్మీయ స్వాగతం పలికారు. అడుగడుగునా పూలు చల్లుతూ, హారతులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. మండలంలో జమ్మలపాలెం, ఎల్ ఆర్ అగ్రహారం, గట్టుపల్లి, తిమ్మసముద్రం, కేశవరం, కొత్తపాలెం, సోమవరప్పాడు, కృష్ణపాడు, బ్రాహ్మణక్రాక, జలదంకి, వేములపాడు తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జలదంకి జడ్పిటిసి అభ్యర్థి వేల్పుల వేణుగోపాల్ ను, అలాగే 13 ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి నాయకులు పార్టీని బలోపేతం చేస్తూ ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ లబ్ధిని, అభివృద్ధిని ప్రతి ఇంటికి వెళ్లి వివరించి ఓట్లను అభ్యర్థించాలని నాయకులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలన్నారు. విపక్షాల దృశ్చర్యలను, ఆగడాలను తిప్పి కొట్టి జడ్పిటిసి స్థానంతో పాటు 13 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మండల ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపి తమ అభ్యర్థులను ఆశీర్వదించి, ప్రతి ఒక్కరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మునగాల తిరుమలరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు కొలకలపూడి బ్రహ్మారెడ్డి, పాలవల్లి మాలకొండారెడ్డి, పులి గుంట మధు రెడ్డి, సొసైటీ చైర్మన్ అప్పలనాయుడు, ముచ్చలా మధుసూదన్ రెడ్డి, నాయకులు కంచర్ల వినోద్, జాజుల శివరామయ్య, చిత్తా బత్తిన మస్తాన్ రెడ్డి,కొల్ల రాధాకృష్ణ, వడ్డె అనురాధ,పచ్చా పెంచల నాయుడు,పున్నం రోసి రెడ్డి,గునుపాటి బాబుల్ రెడ్డి, సింగమనేని మనోజ్ కుమార్ యాదవ్ , మందపల్లి మాల్యాద్రి యాదవ్, మాదిరెడ్డి సుబ్బారెడ్డి, వద్దినేని మురళి, ఉన్నం రవి, గొట్టిపాటి మనోజ్ కుమార్, కొర్రపాటి రామారావు,గుర్రం ప్రవీణ్,మంగళ తిరుముల,దివి శ్రీనివాసులు,మందపల్లి మదన్, స్వర్ణ కొండప నాయుడు, జాజుల హరి, జాజుల కోటయ్య,కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.