పరవాడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి
పరవాడ ,నవంబర్ 1, మేజర్ న్యూస్:
స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా పరిశీలించిన విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి.
స్టేషన్లో విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఐజీ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంపీటీసీ, జడ్పిటిసి ,సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు.
ఓటర్లు ప్రశాంతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని,వృద్ధులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సహాయక చర్యలు అందించాలని సూచించారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.మండలంలో శాంతిభద్ర పరిస్థితి ని ఐజి కి సిఐ భాస్కరరావు వివరించారు.