BREAKING
శాంతిభద్ర సమస్యకు జగనే కారణం. ఘనంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ఆదివాసీ సమాజ సేవే వనవాసి కళ్యాణ పరిషత్ లక్ష్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన నిర్మల్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు పండిత్ జాదవ్ కు ఘన సన్మానం ఢిల్లీ కాంగ్రెస్ సభలో పాల్గొన్న జైపూర్ మండల నాయకులు చుక్క ముగిసింది..!లెక్క మిగిలింది..!! జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యల పరిష్కారం రామలింగాపురంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు జగిత్యాలలో ఈపీఎఫ్ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి రాప్తాడు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి పక్కా ప్రణాళిక, పటిష్ట భద్రతా చర్యలతో.. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.... ఈ నెల 5న కరీంనగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ రాక 2021తో పోలిస్తే కళ్యాణదుర్గం లో తగ్గిన ఓటింగ్ శాతం. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే

ఢిల్లీ సభకు హాజరైన నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు

Select Suryaa Now
ఢిల్లీ సభకు హాజరైన నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు

సంగారెడ్డి;ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న సభను సంగారెడ్డిలోనూ ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేసి సభను ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎల్‌ఈడీ తెరలపై రాహుల్ గాంధీ ప్రసంగాన్ని వీక్షించారు. ఢిల్లీలో జరుగుతున్న సభకు సంగారెడ్డిలోని కాంగ్రెస్ శ్రేణులు కూడా అనుసంధానమయ్యేలా ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేయడం విశేషం.మరోవైపు నిర్మలా జగ్గారెడ్డితో పాటు సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన సభకు నేరుగా హాజరయ్యారు. ఢిల్లీ సభలో కాంగ్రెస్ శ్రేణుల భాగస్వామ్యం, సంగారెడ్డిలో ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.