BREAKING
వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ ఓటీటీ రిలీజ్ డేట్.. డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలివే ఎల్‌నినో ముప్పును ముందుగానే అంచనా వేసి.. నీటి భద్రతకు జిల్లా సమగ్ర కార్యాచరణ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కిటకిట: - స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన ఈవో ఆర్టీసీ బస్సు ప్రారంభించిన సర్పంచ్ పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి: అమీనుద్ధీన్, భాగ్యానంద్ ఖాకీ నిఘాపై దొంగల"చెయ్యి"- రాజీవ్‌ రహదారిపై రెచ్చిపోయిన స్నాచర్లు అమిత్ షా రాకతో కాంగ్రెస్ లో గుబులు.... సింగరేణిలో రూ.330 కోట్ల సోలార్ ప్లాంట్ లకు గ్రహణం...!!! ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు జన్మదిన వేడుక మేము సైతం సోమాజిగూడలో పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ఇంటింటి ప్రచారం.... నిస్వార్థ ఉద్యమకారుడిని కోల్పోయాం.. పీటీ స్వామి సేవలు చిరస్మరణీయం! ఏకగ్రీవంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఎన్నిక అధ్యక్షుడిగా ఎ. శ్రీనివాస్ , ఉపాధ్యక్షుడు గా ముఖ్తార్ అహ్మద్ సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి పూల్స్‌లో అజేయంగా నిలిచిన టైగర్స్ మరియు ఆర్టిస్ట్స్ - హెచ్‌పిఆర్‌సి అరీనా పోలో టోర్నమెంట్ 2026

మహా పాదయాత్రని విజయవంతం చేయాలి

Select Suryaa Now
మహా పాదయాత్రని విజయవంతం చేయాలి

మహా పాదయాత్రని విజయవంతం చేయాలి

రంగారెడ్డి జిల్లా బిజెపి మీడియా కన్వీనర్ సాద మల్లారెడ్డి

కందుకూరు : తెలంగాణలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అరాచక రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ రంగారెడ్డి జిల్లా మీడియా కన్వీనర్, కొత్తగూడ మాజీ సర్పంచ్ సాధ మల్లారెడ్డి తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఆధ్వర్యంలో రేపటి  మధ్యాహ్నం 3 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని తెలిపారు.
హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజాంజాహీ మార్కెట్ ఎక్స్ రోడ్స్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సాధ మల్లారెడ్డి పిలుపునిచ్చారు.


టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్