*మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో నూతన మండల అధ్యక్షుల హాజరు*
రాయికోడ;కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన నూతన మండల అధ్యక్షులు ఈయొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. వారితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జి. అంజయ్య, జిల్లా, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు:
1.వట్‌పల్లి, మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజనాల విశ్వాస్
2.అందోల్ గంగాధర్ అశోక్
3 మునిపల్లి మండలం లింగన్నగారి సతీష్ కుమార్
4.చౌటకూర్ మండలం బోడపట్ల గణేష్
5.పుల్కల్ మండలం మల్లన్నగారి దుర్గా రెడ్డి
6.రాయికోడ్ మండలం పట్లోళ్ల కేదారినాథ్ పాటిల్
7.అందోల్–జోగిపేట టౌన్ డి.జి. వెంకటేశం
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో అందోల్ నియోజకవర్గ నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు.