ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిరసన మహాసభ-రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు విశ్రమించం: తాళ్లపెళ్లి శ్రీకాంత్
సూర్య - మానకొండూర్ : దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి పయనమయ్యారు.యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెళ్లి శ్రీకాంత్ ఆధ్వర్యంలో కరీంనగర్ బృందం ఈ ఢిల్లీ నిరసన కార్యక్రమంలో పాల్గొంది.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెళ్లి శ్రీకాంత్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో 'ఓటు చోరీ'కి పాల్పడుతోంది కేవలం బీజేపీ ప్రభుత్వమేనని, ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి చెందిన ఈ ప్రజా వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ ఎంతమాత్రం సహించదని హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తామందరం ఢిల్లీ వేదికగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్నామని, రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేసి, రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానిగా చేసేంతవరకు యువజన కాంగ్రెస్ శ్రేణులు అహర్నిశలు కృషి చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.