లైఫ్ స్టార్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి .
చింతపల్లి మేజర్ న్యూస్ .నల్గొండ జిల్లా.
చింతపల్లి మండలం మాల్ వెంకటేశ్వర నగర్ లో నిర్వహించిన లైఫ్ స్టార్ హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల. వెంకటరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఆసుపత్రి యాజమాన్యం కృషి చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ఆసుపత్రి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కంకణాల. వెంక రెడ్డిని శాలువ కప్పి ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో మేనేజర్ డైరెక్టర్ లు పోలేపల్లి. వినోద్, శ్రీనివాస్, ఆసుపత్రి యాజమాన్యం, వైద్య సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.