BREAKING
గర్భధారణ సమయంలో వ్యాయామం చేస్తున్నారా: ఈ ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! అమెరికాలో అకస్మాత్తుగా పడిపోయిన నిర్మాణ రంగ ఖర్చులు చిత్ర విడుదల ముందే దర్శకుడికి బంపర్ గిఫ్ట్ ఇచ్చిన హీరో శివకార్తికేయన్: నెట్టింట వైరల్ అవుతున్న కానుక! సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కలబందతో మెరిసే సౌందర్యం: చర్మ సంరక్షణలో అలోవెరా వాడే సరైన విధానాలు ఇవే! అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు? వేల్ రిసార్ట్స్ బోర్డు నామినీల సంఖ్యను సగానికి తగ్గించిన యాక్టివిస్ట్ ఇన్వెస్టర్ ఒయాసిస్! ఓటరు నమోదుతోనే పట్టభద్రుల ప్రాతినిధ్యం!* ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు : ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మౌలిక వసతులు అభివృద్ధికి ప్రాధాన్యత గడ్డపోతారం మున్సిపల్ వైస్ చైర్మన్ మహేందర్ గౌడ్ ప్రైవేట్ డేటా సెంటర్లపై 10 శాతం కెపాసిటీ కేటాయించాలని పుతిన్ ఆదేశం! మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నీటిని పొదుపు చేద్దాం – భవిష్యత్తును కాపాడుకుందాం మాజీ ఎఫ్‌బీఐ అధికారులపై క్రిమినల్ ఫిర్యాదును కొట్టివేసిన అమెరికా ఫెడరల్ జడ్జి! చిలగడదుంపతో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు వెల్లడిస్తున్న పోషకాల నిజాలు ఇవే!

అమెరికాలో తెలంగాణ ప్రముఖుల కలయిక జీఎంఆర్‌కు ఆత్మీయ స్వాగతం

Select Suryaa Now
అమెరికాలో తెలంగాణ ప్రముఖుల కలయిక జీఎంఆర్‌కు ఆత్మీయ స్వాగతం

అమెరికాలోని న్యూయార్క్‌లో దసరా పండుగ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ తెలంగాణకు చెందిన ప్రముఖులను ఆత్మీయంగా కలుసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, బాక్టోలాక్ ఔషధ తయారీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వారి సతీమణిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గడ్డపై పుట్టి అమెరికాలో ఔషధ తయారీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన డాక్టర్ మల్లారెడ్డి విజయ ప్రస్థానాన్ని అభినందించారు. 1995లో సంస్థను స్థాపించి మూడు దశాబ్దాలుగా తన కృషి, పట్టుదలతో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అదేవిధంగా అమెరికాలో వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లక్ష్మారెడ్డిని కూడా ఆత్మీయంగా కలుసుకొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలు, గేయాల ద్వారా ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు తెలంగాణ ఉద్యమంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఆయన అందించిన సాహిత్య సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా గుఱ్ఱపు మచ్చేందర్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పుట్టి ప్రపంచ స్థాయిలో తమ ప్రతిభను చాటుతున్న ప్రముఖులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. పెద్దల అనుభవం, ఆత్మీయత, ఆశీస్సులు జీవితంలో ముందుకు సాగేందుకు ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. వారి ఆశీస్సులతో ప్రజాసేవలో మరింత అంకితభావంతో ముందుకు సాగుతానని పేర్కొన్నారు. అమెరికా గడ్డపై తెలంగాణ ఆత్మీయతను చాటుతూ ప్రముఖుల ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని, నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని మచ్చేందర్ తెలిపారు.