మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
యాదగిరిగుట్ట మేజర్ న్యూస్.....
సోమవారం రోజున యాదగిరిగుట్ట మండలం గౌరయిపల్లి గ్రామంలో మాదకద్రవ్యాల (నార్కోటిక్స్ అవేర్నెస్) అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాదకద్రవ్యాలు మన శరీరాన్ని, మనసును, కుటుంబాన్ని, భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన పదార్థాలు. కొందరు స్నేహితుల ఒత్తిడి, ఆసక్తి లేదా తాత్కాలిక ఆనందం కోసం వీటిని ప్రయత్నిస్తారు. కానీ ఒక్కసారి అలవాటు పడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం.
మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు:
శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.
చదువుపై ఆసక్తి తగ్గి, విద్యలో వెనుకబడే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు మానసిక, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. నేరాలకు పాల్పడే ప్రమాదం పెరుగుతుంది. జీవిత లక్ష్యాలు, భవిష్యత్తు అవకాశాలు దెబ్బతింటాయి.
ఈ కార్యక్రమం లో పోలీసు సిబ్బంది తో పాటు గ్రామస్థులు పాల్గొనడం జరిగింది.
ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యాదగిరిగుట్ట పిఎస్