BREAKING
రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక 'రామాయణం' చిత్రానికి బాంబే హైకోర్టు భారీ రక్షణ! కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవండి - తొప్పాటిపల్లి, తుమ్మిందపాళ్యంలో కంచెర్ల ప్రతిమ ,ప్రచారం - రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటు వేయండి. పనసపండు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు.. షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకోవచ్చా? అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్థాన్ అద్భుత సంచలనం: వన్డే ర్యాంకింగ్స్‌లో శ్రీలంకను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి దూసుకెళ్లిన వైనం! రజినీకాంత్ జైలర్ 2 బాక్సాఫీస్ కలెక్షన్లు: సోమవారం భారీ పతనం అయినప్పటికీ రూ. 461 కోట్ల మార్కు దాటిన వైనం! బియ్యం వ్యాపారులపై అధికారుల కొరడా! రైస్ ట్రేడర్స్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు భారత్ - న్యూజిలాండ్ వన్డే సిరీస్: అన్ని మ్యాచ్‌లు ఉదయం 7:30 గంటలకే ప్రారంభం! నందమూరి మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో సంచలన మార్పు: శ్రీలీల స్థానంలో ఆ బాలీవుడ్ బ్యూటీ ఎంట్రీ! కూటమికి ఓటేయండి.. అభివృద్ధిలో భాగస్వాములు కండి: మంత్రి కందుల దుర్గేష్ విద్యుత్‌ను పొదుపుగా వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి .. అదనపు కలెక్టర్ సంగీత ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ దోసకాయ తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు! రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు .

ఓటరు నమోదుతోనే పట్టభద్రుల ప్రాతినిధ్యం!*

Select Suryaa Now
ఓటరు నమోదుతోనే పట్టభద్రుల ప్రాతినిధ్యం!*

 

*అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి.. బీవీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బూరుగు భరత్‌రెడ్డి పిలుపు*

*చౌటుప్పల్‌, మేజర్ న్యూస్:* వరంగల్‌–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీవీఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బూరుగు భరత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పట్టభద్రుల సమస్యలు, హక్కులు, ఆకాంక్షలకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందడం అవసరమని పేర్కొన్నారు.ఉన్నత విద్యను అభ్యసించిన పట్టభద్రులు ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ద్వారా తమ అభిప్రాయాలను, సమస్యలను ప్రతిబింబించే నాయకత్వానికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందన్నారు. అర్హత కలిగిన వారు ఓటరు నమోదును నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పట్టభద్రులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా యువ పట్టభద్రులు ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ఇతర అర్హులకు కూడా సమాచారం అందించాలని భరత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.