సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు
పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని చిన్నపురి గ్రామంలో ప్రతి సంవత్సరం నవంబర్ 2న క్రైస్తవులు మరణించిన తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పెద్దల ఆత్మల శాంతి కోసం సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇందులో భాగంగా కట్టంగూర్ మండలంలోని చిన్నపురి గ్రామంలో సోమవారం క్రైస్తవులు సమాధులను శుభ్రపరిచి, పూలు, కొవ్వొత్తులు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన చిన్నపురి గ్రామస్తులు స్వగ్రామానికి చేరుకుని విచారణ గురువు ఫాదర్ లీనో కాల్యా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, దాతల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శాంసన్, అలెగ్జాండర్, ప్రవీణ్, మరయ్య, రాయప్ప, అంతోని, సుధాకర్, జయంతి, బాలరాజు, జయపాల్, కిరణ్, కిషోర్, విలియం, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.