BREAKING
ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు

పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు

Select Suryaa Now
పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు

 

ఎమ్మెల్యే కుంభం సహకారంతో పట్టణంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: చైర్‌పర్సన్ శ్రీవాణి*

*యాదాద్రి భువనగిరి,ప్రతినిధి మేజర్ న్యూస్* 
భువనగిరి పట్టణంలోని పహాడినగర్‌లో తాగునీటి సమస్య పరిష్కారానికి మూడు నూతన బోర్లు ఏర్పాటు చేశారు. 30వ వార్డు కౌన్సిలర్ ఎండీ లయిక్ అహ్మద్ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ బోర్లను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో పట్టణంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు.కౌన్సిలర్ లయిక్ అహ్మద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గతంలో వార్డులో పర్యటించిన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు మూడు బోర్లు మంజూరు చేయించారని, ఇందుకు వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో వార్డును మరింత అభివృద్ధి చేస్తానన్నారు. వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ మాట్లాడుతూ పహాడినగర్‌లో దీర్ఘకాలంగా నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కౌన్సిలర్ చేస్తున్న కృషిని అభినందించారు.కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. చంద్రప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ డీఈఈ, ఏఈఈ, కాంగ్రెస్ నాయకులు ఎండీ షరీఫ్, జబ్బార్, కామిల్, సల్మాన్ ఖాన్, వస్తువుల సాయి, లైన్‌మెన్ జి. ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.