ప్రజాస్వామ్య పరిరక్షణ మహా పాదయాత్రకు సంగారెడ్డి బీజేపీ నాయకుల పయనం!
సంగారెడ్డి;ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న మహా పాదయాత్రలో పాల్గొనేందుకు సంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు ఉత్సాహంగా బయలుదేరారు. ఎన్నికల సంఘంపై, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ ప్రజల్లో అవగాహన కల్పించాలనే సంకల్పంతో ఈ పాదయాత్రలో భాగస్వాములు కానున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు తమ మద్దతు తెలియజేయనున్నట్లు నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు ప్రసాది రవిశంకర్ (జిల్లా కార్యదర్శి), అశ్వంత్ (ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి), ఆకుల సాయికుమార్ (మాజీ మండల అధ్యక్షుడు), చంద్రశేఖర్ గౌడ్, అవన్ కృష్ణకాంత్ (సంగారెడ్డి పట్టణ నాయకుడు) తదితరులు పాల్గొన్నారు.పార్టీ సిద్ధాంతమే బలం.. నాయకుల ఐక్యతే శక్తి.. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం అంటూ నాయకులు నినదించారు.