ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యండి రోడ్ షో లో కదం తొక్కిన జగనన్న సైనికులు
కుందుర్పి సూర్య ; అన్నా ఫ్యాన్ గుర్తుకై ఓటెయ్యాలంటూ సోమవారం కుందుర్పిలో జరిగిన వైసీపీ రోడ్ షో ఓటర్లను ఆకట్టుకుంది. జడ్పిటిసి ఎన్నికల ప్రచారానికి కొన్నిగంటల్లో తెరపడుతున్న విషయం తెలిసిందదే.మండల కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి శ్రీదేవిసుదర్శన్ రెడ్డి, అలాగే 15 స్థానాల్లో పోటీ చేస్తున్న వైసిపి మరియు సీపీఐ అభ్యర్థులను గెలిపించాలంటూ సోమవారం భారీరోడ్ షో నిర్వహించారు.స్థానికదర్గా సర్కిల్ నుండి ప్రారంభమైన రోడ్ షో రామాలయం, మార్కెట్,వైయస్సార్ కూడలి,బ్యాంక్ సర్కిల్ మీదుగా జమ్మిచెట్టు వరకు నిర్వహించారు.ఈరోడ్ షోలో అనేకమంది జగనన్న సైనికులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త, బడుగు,బలహీన వర్గాల నేత బేస్తరపల్లి కృష్ణమూర్తి పాల్గొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరించగలిగే నాయకులను ఎన్నుకోవడంలో ప్రజలందరికి పూర్తిస్వేచ్ఛ ఉందన్నారు. ప్రజలందరికీ మంచి జరగాలంటే ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికల్లో ఫ్యాన్ మరియు కంకికొడవలి గుర్తులకై ఓటు చేయాలని ఓటర్లకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అనేకమంది జగనన్న సైనికులు కమ్యూనిస్టుపార్టీ కార్యకర్తలు జెండాలను చేత పట్టుకుని రోడ్ షోలో పాల్గొన్నారు.
రాజు కుందుర్పి సూర్య రిపోర్టర్