గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
కుల్కచర్ల, మేజర్ న్యూస్:గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి గ్రామంలో అనువైన స్థలాన్ని పరిశీలించి గుర్తించి కేటాయించాలని కోరుతూ చెరువుముందలి తండా (ఏ)గ్రామ సర్పంచ్ రవీందర్ నాయక్ తహసీల్దార్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ విషయంపై ఎమ్మార్వో సానుకూలంగా స్పందించినట్లు సర్పంచ్ తెలిపారు.