చిలకలూరిపేటమున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లునేడు ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లలో 48 వార్డుల ఫలితాలు
చిలకలూరిపేట న్యూస్: చిలకలూరిపేట మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 48 వార్డులకు నిర్వహించిన ఎన్నికల పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను అధికారులు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు.నేడు తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.కౌన్సిలర్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 16 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మూడు రౌండ్లలో 48 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.ఒక్కో రౌండ్‌లో 16 వార్డులకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు.అదేవిధంగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా మరో 7 టేబుళ్లను ఏర్పాటు చేశారు.చైర్‌పర్సన్ అభ్యర్థుల ఫలితాలను ఒకే రౌండ్‌లో వెల్లడించేలా అధికారులుఏర్పాట్లు చేపట్టారు.ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.అభ్యర్థులు,రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది.వెలువడనున్న ఫలితాలతో చిలకలూరిపేట మున్సిపాలిటీలో రాజకీయ భవితవ్యం తేలనుంది.