BREAKING
చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ! తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యం.

స్థానిక ఎన్నికలు సర్వం సిద్ధం

Select Suryaa Now
స్థానిక ఎన్నికలు సర్వం సిద్ధం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంతూర్పుగోదావరి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 5న నిర్వహించనున్న పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా, వీటికి 73 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అదేవిధంగా 412 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా, ఏడు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 405 స్థానాలకు 901 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

ఈ ఎన్నికల పరిధిలో మొత్తం 12,02,548 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 5,89,373 మంది పురుషులు, 6,13,141 మంది మహిళలు, 34 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,476 పోలింగ్ కేంద్రాలను గుర్తించగా, వీటిలో 499 సున్నిత, 239 అతి సున్నిత పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. మొత్తం 738 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం కల్పించనున్నారు.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, పోలింగ్ సామగ్రిని సిద్ధం చేశారు. పోలింగ్ విధుల నిర్వహణకు 1,771 మంది రిటర్నింగ్ అధికారులు, 8,856 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 84 మంది ప్రిసైడింగ్ అధికారులు, 245 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు. వీరితో పాటు 496 మంది జోనల్ అధికారులు, 270 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. ఎన్నికల విధులకు నియమించిన సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి తరలింపునకు మొత్తం 496 వాహనాలను ఏర్పాటు చేయగా, వీటిలో 270 పెద్ద వాహనాలు, 226 చిన్న వాహనాలు ఉన్నాయి.జిల్లాలో 21 పంపిణీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రిని సంబంధిత సిబ్బందికి అందజేయనున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచేందుకు, ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు మూడు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియకు అవసరమైన పట్టికలు, సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లు చేపట్టారు.

ఎన్నికల భద్రతకు సంబంధించి పోలీసు శాఖ ఆధ్వర్యంలో 1876 మంది తో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో 12 డీఎస్పీలు, 30 సీఐలు, 75 ఎస్ఐలు, 1321 కానిస్టేబుళ్లు, ఉండగా, 438 ఇతర సిబ్బందిని విధులకు కేటాయించి పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నవంబర్ 3 న మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రచార గడువు ముగిసిన అనంతరం ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థులు, రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు.