మహిళల అభివృద్ధికి గ్రామ సమాఖ్య భవనాలు ఎంతో ఉపయోగకరం:: సర్పంచ్ శ్యామల రవివర్మ.
మహిళల అభివృద్ధికి గ్రామ సమాఖ్య భవనాలు ఎంతో ఉపయోగకరం:: సర్పంచ్ శ్యామల రవివర్మ.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
మండల పరిధిలోని గౌరారం గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం గ్రామ సమాఖ్య భవన నిర్మాణ పనులను సర్పంచ్ శ్యామల రవివర్మ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ రవి వర్మ మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మహిళా స్వయం సహాయక సంఘాలు వెన్నెముక లాంటివన్నారు.మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు,బ్యాంకు లావాదేవీలు,స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ భవనం ఎంతో దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సున్నం రమేష్,పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జునరావు,వర్కింగ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు కణితి రాజమ్మ,వార్డు సభ్యులు శ్రీలత,సీతాశ్రీ,గంగోత్రి,గ్రామ పెద్దలు కణితి రాముడు, సేర్పు కోచ్‌లు జ్యోతి, హరిత,అశ్విని,తదితరులు పాల్గొన్నారు.