BREAKING
ఎన్నికల విధుల నిర్వహణపై సిబ్బందికి శిక్షణ దోసకాయ తినడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు పోషక విలువలు! రామవరంలో వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి కొండేటి భీమేష్ ఇంటింటా ప్రచారం. మమితా బైజు అసలు పేరు నమిత కాదా.. బర్త్ సర్టిఫికెట్‌లో జరిగిన ఆ పొరపాటే ఆమెను స్టార్‌ను చేసిందా! గెలుపు దిశగా ఎన్డీఏ జడ్పిటిసి టిడిపి అభ్యర్థి దొండపాటి సుబ్బరాజు . విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి మంచి నాయకులుగా ఎదగాలి కలెక్టర్ విజయోత్సవ సంబరాలకు ప్రజలు దూరంగా ఉండాలి : డిఎస్పీ శేషు వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి..... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు ప్రమాద బాధిత టీడీపీ నాయకుడికి చిన్నబాబు ఆర్థిక సహాయం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో భూ రీ సర్వే --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పులిమామిడి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలప్రారంభం స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పిఓ ఏపీఓలకు 2 వ విడత 181 మందికి శిక్షణా కార్యక్రమం. శ్రీ మార్కండేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన

-కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు

Select Suryaa Now
-కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు

పటాన్‌చెరు;పటాన్‌చెరు మండలం కర్దనూరు గ్రామంలోని శిశు విహార్ హైస్కూల్‌లో సైబరాబాద్ పోలీస్ షీ టీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు మహిళా భద్రత, వ్యక్తిగత రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సబ్‌ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్ విద్యార్థినులకు పలు కీలక సూచనలు చేశారు.గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఆపద సమయాల్లో విద్యార్థినులు భయపడకుండా ధైర్యంగా వ్యవహరించాలని ఎస్‌ఐ సూచించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన స్నేహితులకు తెలియజేయాలని చెప్పారు. బంధువులైనా, బయటివారైనా తప్పుగా ప్రవర్తిస్తే మౌనంగా ఉండకూడదని స్పష్టం చేశారు.మహిళలు,బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే షీ టీం నంబర్ 8712663679కు ఫోన్ చేసి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.విద్యార్థులు మొబైల్ ఫోన్ల వినియోగాన్ని తగ్గించి, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చదువుపై ప్రత్యేక దృష్టి సారించాలని హితవు పలికారు.అంతకుముందు పాఠశాల చైర్మన్ అనిల్ కృష్ణ పిళ్లై, ప్రధానోపాధ్యాయురాలు బినా పిళ్లై ఎస్‌ఐ శ్యాంసుందర్‌ను శాలువాతో సన్మానించి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అనిల్ కృష్ణ పిళ్లై, ప్రధానోపాధ్యాయురాలు బినా పిళ్లై, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.