సీపీఐ(ఎం) పాదయాత్రకు ప్రజాదరణ
సంస్థాన్ నారాయణపురం. మేజర్ న్యూస్: శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని, రాచకొండ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) నారాయణపురం మండల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆదివారం శివన్నగూడెం ప్రాజెక్టు నుంచి ప్రారంభమైన పాదయాత్ర సోమవారం రెండో రోజు సాయిగొనిబావి, లింగంవారిగూడెం, గుజ్జ, మల్లారెడ్డిగూడెం, సర్వేల్, నాగంవారిగూడెం మీదుగా అల్లందేవిచెరువు చేరుకుంది. పలు గ్రామాల్లో పాదయాత్రకు ప్రజలు బతుకమ్మలు, బోనాలతో ఘన స్వాగతం పలికారు. చిమీర్యాల, శేరిగూడెం గ్రామాల్లో మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలకగా, పలువురు నాయకులు పూలమాలలు వేసి అభినందించారు. పాదయాత్రలో సీపీఐ(ఎం) నాయకులు దోనూరు నర్సిరెడ్డి, తుమ్మల శ్రీనివాస్ రెడ్డి, గుంటోజు సుదర్శన చారి, తుమ్మల నర్సిరెడ్డి, బద్దం నర్సిరెడ్డి, గుండు లింగస్వామి,గుండు లింగయ్య, సుధాకర్,సుర్వి వెంకటేష్,శేఖర్,జె.విష్ణు,జి. పాండు,రమేష్,జనగల నరసింహ,బద్దం జెన్నారెడ్డి,నర్సిరెడ్డి,రామాంజనేయ,దశరథ, జంగయ్య,వెంకటయ్య,అంజయ్య,బిక్షపతి, సురవి కిరణ్, దుర్గా రెడ్డి, రంగారెడ్డి, కృష్ణమూర్తి, దౌల జంగయ్య, విశ్వనాథ చారి, వెంకటేష్ హరికృష్ణ , గుంటోజు శ్రీనివాసచారి, మల్లెపల్లి లలిత, దోడ యాదిరెడ్డి, అయితరాజు గాలయ్య, ఆరుట్ల రాజు, కుక్కుడాల మంగమ్మ, కేసాని కృష్ణ, దోతగోని శంకరయ్య, ఉప్పలపల్లి బాలకృష్ణ, గుండు జంగయ్య, వెలిజాల సుందరయ్య, జెనిగల యాదయ్య, దోడ భరత్‌రెడ్డి, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.