BREAKING
వర్షాలకు వరి పంటకు తీవ్ర నష్టం.. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు. ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి..... రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి ఏలూరు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట ఏర్పాట్లు ప్రమాద బాధిత టీడీపీ నాయకుడికి చిన్నబాబు ఆర్థిక సహాయం. అత్యాధునిక సాంకేతిక పరికరాలతో భూ రీ సర్వే --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పులిమామిడి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలప్రారంభం స్థానిక సంస్థల ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై పిఓ ఏపీఓలకు 2 వ విడత 181 మందికి శిక్షణా కార్యక్రమం. శ్రీ మార్కండేశ్వర స్వామి భజన మండలి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన వరుస తుఫాన్ల దెబ్బకు వరి రైతు విలవిల.. పంట నష్టం రైతుకు కన్నీళ్లు.. అమితాబ్ బచ్చన్‌కు జయ బచ్చన్ పెట్టిన ముద్దుపేరు: హరివంశ్‌ రాయ్ బచ్చన్ ఎందుకు వారించారంటే! సర్పంచ్ అభ్యర్థిగా సత్యవేణి ప్రజల ముందుకు.. అభివృద్ధికి అండగా ఉంటానన్న మాజీ ఎంపీటీసీ వీర వెంకటరావు ప్రజారోగ్యాన్ని స్ట్రెచర్‌పై పడుకోబెట్టిన తెలంగాణ ప్రభుత్వం!: డా శివ ప్రసాద్ పిల్లలమర్రి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన.. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?. --గిరిజాల బాబు అల్లు అర్జున్ మాటలతో నా జీవితం మారిపోయింది: కమెడియన్ ప్రభాస్ శ్రీను సంచలన వ్యాఖ్యలు!

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

Select Suryaa Now
జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

 

రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బుర్రి శ్రీరాములు

మునగాల మేజర్ న్యూస్: నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ పట్టణంలో జరగనున్న అఖిల భారత రైతు సంఘం 38వ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు.
సోమవారం మండల పరిధిలోని రేపాల గ్రామంలో శాఖ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో ముడిపడిన మునగాల ప్రాంతం నుంచి మహాసభలకు పెద్ద ఎత్తున రైతులను తరలించాలని కోరారు. నవంబర్ 5 నుంచి దప్పుల దరువులు, కోలాట బృందాలు, కళాకారులతో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆయన సూచించారు.
రైతుసంఘం జాతీయ మహాసభల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతుసంఘం నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జూలకంటి విజయలక్ష్మి, రైతు సంఘం నాయకులు సోమపంగు జానయ్య, మండల కమిటీ సభ్యులు తుమ్మ సతీష్, పిచ్చయ్య,గోగిరెడ్డి వెంకటరెడ్డి, వీరాస్వామి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.