BREAKING
మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి : జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పిలుపు పలమనేరు మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకునేదెవరికో..? టిడిపి చరిత్ర తిరగరాస్తుందా.. వైసీపీ ఆధిపత్యం నిలబెట్టుకుంటుందా! ఘనంగా ఏ సీ సీ ఏ సక్సెస్ మీట్ 2026 - అవినాష్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహణ ఈరోజు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయం

చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా

Select Suryaa Now
చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా

 

 

హాలియా మేజర్ న్యూస్.
నాగార్జునసాగర్ నియోజకవర్గం, హాలియా మున్సిపాలిటీలోని చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ. నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్    ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి కోదాడ -జడ్చర్ల జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగింది,
హాలియా మున్సిపాలిటీలోని నాలుగో వార్డ్ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు వివక్ష చూపుతున్నారు,
ఏడాదికాలంగా 4వ వార్డు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా బిఆర్ఎస్ కౌన్సిలర్ ని అవమానిస్తున్న మున్సిపల్ చైర్మన్, కమిషనర్.

బిఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులకు ప్రభుత్వ నిధులు ఖర్చు చేయరా.
నాలుగో వార్డ్ నుంచి ప్రజలు చెల్లించిన పన్నులు మున్సిపాలిటీకి అవసరం లేదా,నాలుగవ వార్డు అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవితి తల్లి ప్రేమ ఎందుకు ప్రదర్శిస్తున్నారు,
జనరల్ స్థానమైన ఈ వార్డు నుంచి జంగాల సామాజిక వర్గానికి చెందిన కడమంచి ప్రమీల శ్రీనివాస్ అగ్రవర్ణాలపై గెలవడం నేరమా.
అగ్రవర్ణ పెత్తందారులు ఈ ఆడబిడ్డపై కత్తి కట్టడం ఎంతవరకు సబవు, హాలియా మున్సిపాలిటీ నూతన పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి నాలుగో వార్డ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు వివక్ష చూపుతున్నారు, ఇది వారికి తగదు. జనరల్ స్థానం నుంచి జంగాల సామాజిక వర్గానికి చెందిన కడమంచి ప్రమీల శ్రీనివాస్ అనే ఆడబిడ్డ గెలుపొందడాన్ని ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు అగ్రవర్ణాలు జీర్ణించుకోలేకపోతున్నారు,
బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మేము ఈ వివక్ష చూపలేదు, 
బిఆర్ఎస్ పార్టీ తోపాటు కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న  వార్డుల్లో కూడా అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేయడం జరిగింది,ఇవాళ హాలియా మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం నిధులు కేటాయించకపోవడం బాధాకరం సిగ్గుచేటు,ఇందిరమ్మ పాలన అంటే బలహీన వర్గాలను, దళిత గిరిజనులను రాజకీయాల్లో కొనసాగకుండా అణిచివేయడమేనా,
అభివృద్ధిని అడ్డుకోవడమే ప్రజాపాలనా  కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులను అవమానించే విధంగా రాజకీయాలు నిర్వహించడం బాధాకరం అవివేకం,
కాంగ్రెస్ పార్టీ నాయకులు తన విధానాన్ని మార్చుకోకపోతే అందుకు ప్రతిఫలం అనుభవించక తప్పదు,హాలియా మున్సిపాలిటీలో పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది 
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కమిషనర్ అవకతవకలకు పాల్పడుతున్నారు,ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది,కమిషనర్ చేతివాటం ప్రదర్శిస్తూ అనర్హులకు ఇందిర ఇల్లు మంజూరు చేస్తున్నాడు,
కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వ భూములను కొల్లగొడుతున్నారు,
టి యు ఎఫ్ ఐ డి సి  నుంచి హాలియా మున్సిపాలిటీకి 3.8 కోట్ల రూపాయలు వస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్య వహిస్తున్న 11 వార్డుల్లోని పనికి  ఖర్చు చేస్తే ఎలా,
ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకోవడమేనా ప్రజాపాలనా,రెండేళ్ల తర్వాత మళ్ళీ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది,మీరు చేసిన అవినీతి భాగోతం అంతా బయటపెడతాం అనా పైసతో మీరు తిన్నది కక్కిస్తాం, ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.