BREAKING
భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ!

కేఎల్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త సమావేశం

Select Suryaa Now
కేఎల్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త సమావేశం

తాడేపల్లి   న్యూస్    కేఎల్‌ యూనివర్సిటీలో రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్టీ ఐ హెచ్ ) సంయుక్త ఆధ్వర్యంలో కార్పొరేట్‌–ఇన్‌స్టిట్యూషన్‌ అనుసంధాన సమావేశం సోమవారం  ఘనంగా జరిగింది. వడ్డేశ్వరం లోని యూనివర్సిటీ ప్రాంగణంలో పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడం, నూతన సాంకేతిక ఆవిష్కరణలు, సంయుక్త పరిశోధనలు మరియు స్టార్టప్‌లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వివిధ రంగాలకు చెందిన కార్పొరేట్ ప్రతినిధులు, స్టార్టప్ నిర్వాహకుల బృందం విశ్వవిద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థులకు పరిశ్రమల ఆధారిత ప్రాజెక్టులు అందించడం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి మరియు నూతన ఉత్పత్తుల అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో కేఎల్‌ వర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ జి. పార్థసారథి వర్మ, ప్రో వైస్ చాన్సులర్లు డాక్టర్ ఎన్. వెంకట్ రామ్, డాక్టర్ కె. రాజశేఖర రావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. పవన్ కుమార్ మరియు ఆవిష్కరణల కేంద్రం సీనియర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వి. రాజేష్‌లతో పాటు డీప్‌ల్యూర్‌ సీఈఓ హర్షవర్ధన్‌, స్పేస్‌ఇన్ఫ్‌ టెక్నాలజీస్‌ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ శ్రీదేవి తాళ్లూరి, ఇతర ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.