రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శిగా నాగమణి నియామకం.
రాష్ట్ర మహిళ విభాగం కార్యదర్శిగా నాగమణి నియామకం.
దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::
ఆదివాసి సంక్షేమ పరిషత్ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బుటారి నాగమణి ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఆదివారం మణుగూరు కేంద్రంలో నిర్వహించిన జిల్లా సమావేశంలో రాష్ట్ర నాయకత్వం ఆమెను ఈ పదవికి ఎంపిక చేసింది. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ..తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పూనెం శ్రీనివాస్,ఉపాధ్యక్షులు సాయం కామరాజు,ఏటిఏ అధ్యక్షులు జయబాబు కృతజ్ఞతలు తెలిపారు.సంఘ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆదివాసీ జాతి సంక్షేమం,హక్కుల సాధన కోసం నాయకుల బాటలో నడుస్తూ నిరంతరం శ్రమిస్తానని ఆమె స్పష్టం చేశారు.నాగమణి ఎన్నిక పట్ల పలువురు ఆదివాసి సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.