శ్రీనివాసరావుమాస్టర్ విజయం ఖాయం
గుంటూరు రూరల్ మండలం లాలుపురం వీరన్నపాలెం, వెళ్లి వెళ్లివారిపాలెం లో కూటమి బలపరిచినజనసేన పార్టీ అభ్యర్థి కాటూరి శ్రీనివాసరావు (మాస్టర్) ఎన్నికల ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈనెల ఐదున జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు, జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింత సాంబశివరావుకు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. లాలూపురం గ్రామం అంటే జనసేన గడ్డ అని అభిమానులు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ఎంపీటీసీగా శీను మాస్టర్ విజయం ఖాయం అని అన్నారు. ప్రచారంలో గ్రామ మాజీ సర్పంచ్ లు తన్నీరుసత్యనారాయణ, కాటూరి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు తోట శివశంకరరావు, తోట పెద్ద శంకర్రావు, రామిశెట్టి బాలకృష్ణ, తోట సీతారామయ్య, గనిమిశెట్టి సురేష్, కూటమి అభిమాను లు మహిళలు యువకులుభారీ సంఖ్యలో పాల్గొన్నారు.