ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఇంధన పొదుపుపై అవగాహన కార్యక్రమం
గుంటూరు న్యూస్: బీఆర్‌ఐసీఎస్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలలో భాగంగా, రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా “ఇంధనాన్ని ఆదా చేద్దాం” అనే ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు ఆధ్వర్యంలో 02.11.2026 న గుంటూరు నగరంలోనినాగారంపాలెం, కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏపీపిసీబీ , ప్రాంతీయ కార్యాలయం, గుంటూరు పర్యావరణ ఇంజినీర్ ఎండీ . నజీనా బేగం మాట్లాడుతూ ఇంధన వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని, విద్యుత్ వృథాను అరికట్టడం, అవసరం లేనప్పుడు విద్యుత్ పరికరాలను ఆపివేయడం, ఇంధన సామర్థ్యం కలిగిన పరికరాలను వినియోగించడం వంటి అలవాట్లను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలోభాగం చేసుకోవాలని సూచించారు. ఇంధన పొదుపు ద్వారా సహజ వనరుల పరిరక్షణతో పాటు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతనిర్వర్తించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వఐటీఐ కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస, ట్రైనింగ్ ఇన్‌ఛార్జి రవికుమార్, ఐటీసీ నారాయణ బృందం, పర్యావరణ సమన్వయకర్త డి. తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలోసుమారు 300 మంది ఐటీఐ కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులుఇంధన పొదుపు, విద్యుత్ వనరుల సమర్థ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న చిన్న పొదుపు చర్యల ద్వారా కూడా పర్యావరణ పరిరక్షణకు గణనీయమైన తోడ్పాటు అందించవచ్చని ఈ కార్యక్రమం ద్వారాఅవగాహన కల్పించారు.