andhrapradesh
4వఎంపిటిసి సెగ్మెంట్ సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యం.
పెదకాకాని న్యూస్: అవినీతి రహిత పాలనే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా మార్గంలోని ప్రజాసేవ చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పెదకాకాని మండల జడ్పిటిసి గా ప్రజాక్షేత్రంలో ఎన్నికల బరిలో నిలబడ్డానని ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుపై వేసి తనను గెలిపిస్తే పెదకాకాని నాలుగవ ఎంపిటిసి సెగ్మెంట్ సమస్యల పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెదకాకాని నాలుగవ ఎంపీటీసీ సెగ్మెంట్ అభ్యర్థిని ముడియాల పద్మశ్రీ లిల్లీ కుమారి కోరుతున్నారు. సెగ్మెంట్లోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సుపరిపాలనను ఆదర్శంగా తీసుకొని, మాజీ రాజ్యసభ సభ్యులు వైసిపి సీనియర్ నాయకులు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆశీస్సులతో పొన్నూరు నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ సారధ్యంలో, పెదకాకాని మండల వైసిపి అధ్యక్షులు ముడియాల మల్లికార్జున్రెడ్డి, పెదకాకాని గ్రామ వైసిపి అధ్యక్షులు సుంకర కృష్ణారెడ్డి లతోపాటు వైసిపిలోని అందరి సహకారంతో పెదకాకాని 4వ ఎంపిటిసి సెగ్మెంట్ సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని ఆమె అన్నారు. రెండున్నర ఏళ్లుగా రాష్ట్రంలో పాటు అన్ని మండలాల్లో గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడిందని తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.