బైక్ దొంగల ముఠా అరెస్ట్.. 13 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
డీఎస్పీఎం. హనుమంతరావు
నరసరావుపేట న్యూస్ : ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడు తున్న నిందితులను నరసరావుపేట రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా నరసరావుపేటడీఎస్పీ ఎం. హనుమంత రావు సోమవారం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసినవిలేకరుల సమావేశంలో వెల్లడించారు. పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జగదీష్ అదహళ్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, నరసరావుపేట అదనపు ఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూరల్ సీఐ ఎం.వి. సుబ్బారావుపర్యవేక్షణలో ఎస్‌ఐ సీహెచ్. కిషోర్, డబ్ల్యూఎస్‌ఐ ఫిరోజ్ ఫాతిమాసిబ్బందితో కలిసి నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సోమవారంరావిపాడు గ్రామ శివారులోని చెక్‌పోస్టు వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామానికి చెందిన వంగా మహేష్‌రెడ్డి (19), మరో ఇద్దరు ఈ చోరీల వ్యవహారంలోఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్‌ఐ కిషోర్, డబ్ల్యూఎస్‌ఐ ఫిరోజ్ ఫాతిమా, సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందిం చారు. వారికి మార్గనిర్దేశం చేసిన నరసరావుపేట అదనపు ఎస్పీ ఎం. హనుమంతరావును ఎస్పీ ప్రశంసించినట్లు తెలిపారు.