BREAKING
మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్ మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ రిటైర్మెంట్ రోజే ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ అందించాలి "అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే వచ్చి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు జగన్ హడావుడి ---- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, సూర్య : తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాజువాక హైస్కూల్ రోడ్డులోని మండల పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన.. ఓటు వేసి ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తించారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరూ అఖండ మెజారిటీతో ఘనవిజయం సాధిస్తారని, మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య క్షేత్రంలో ప్రజలు ప్రతి విషయాన్నీ ఎంతో నిశితంగా గమనిస్తున్నారని, మంచి చెడులను ఆలోచించి సరైన తీర్పునిస్తారని తెలిపారు. యువత బంగారు భవిష్యత్తుకు, రాష్ట్ర సమగ్ర వికాసానికి ఓటు హక్కే అసలైన నాంది అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతిని, భవిష్యత్తు తరాల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా కూటమి వైపే మొగ్గు చూపుతున్నారని, వారి సంపూర్ణ మద్దతుతో కూటమి అభ్యర్థులు తప్పకుండా గెలుపొందుతారని పల్లా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.