BREAKING
మాగుంట లేఔట్‌లో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల నిశ్చితార్థ వేడుకకు హాజరైన శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం --పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ మలబార్ ఉద్యోగుల స్వచ్ఛ భారత్ పోలింగ్ సరళిని పరిశీలించిన తారక్ నాథ్ రెడ్డి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్ల చీరాల, రేపల్లెలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు చీరాలలో 72.69 శాతం.. రేపల్లెలో 69.65 శాతం పోలింగ్ మురసు తుఫాన్‌పై జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ రిటైర్మెంట్ రోజే ఉద్యోగికి అన్ని బెనిఫిట్స్ అందించాలి "అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే వచ్చి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు జగన్ హడావుడి ---- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

Select Suryaa Now
పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాలులో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన నిరాహార దీక్ష, ప్రాణత్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని తెలిపారు. పొట్టి శ్రీరాములు పోరాట ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం తెలుగు ప్రజల చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన త్యాగస్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డీఆర్వో విజయకుమార్, కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.