గ్రామాల అభివృద్ధి కి ప్రభుత్వం కృషి.. సామినేని ఉదయభాను
జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఎంపీటీసీ జడ్పీటీసీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించిన సామినేని ఉదయభాను.
జగ్గయ్యపేట మండలం, చిల్లకల్లు గ్రామంలో రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను , వారి తనయులు జగ్గయ్యపేట జనసేన పార్టీ ఎన్నికల సమన్వయకర్త యువనాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
చిల్లకల్లు గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రావూరి కవిత, చిలుకూరు సుజాతతో పాటు జడ్పీటీసీ అభ్యర్థి కోసూరి ప్రహ్లాద్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు
ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సామినేని ఉదయభాను పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా