జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ ఏ. రమేష్ కుమార్
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆదివారం నిర్వహించిన జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (NMMS) కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, నిర్వహణ ఏర్పాట్లు, పరీక్షా విధానాన్ని పరిశీలించారు. పరీక్షలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
జిల్లా కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 817 మంది విద్యార్థులకు గాను 770 మంది హాజరుకాగా, 47 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 94.25 శాతం హాజరు నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు, జిల్లా టెస్ట్ బుక్ మేనేజర్ నరసింహులు, బిజినపల్లి ఎంఈఓ సయ్యద్ మైనుద్దీన్, ప్రధానోపాధ్యాయులు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సందడి రవీందర్ రెడ్డి,నాగర్ కర్నూల్, రూరల్, సూర్య న్యూస్