BREAKING
భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కొల్లూరు జాబ్ మేళాకు అనూహ్య స్పందన హంటింగ్టన్ వ్యాధి చికిత్సకు యూనిక్యూర్ జీన్ థెరపీ...మే 1, 2027 నాటికి నిర్ణయం తీసుకోనున్న ఎఫ్‌డీఏ!

శంభన్ వీదిలో ..... టిడిపి శ్రేణులు విస్తృత ప్రచారం.

Select Suryaa Now
శంభన్ వీదిలో ..... టిడిపి శ్రేణులు విస్తృత ప్రచారం.

ముత్తుకూరు,  మేజర్ న్యూస్ :   కృష్ణపట్నం ఎంపీటీసీ స్థానం బిట్-1 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడలి రేవతి ఆదివారం శంభన్ వీదిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కరపత్రం చేత పట్టుకుని ప్రతి ఇంటి గడప తొక్కి మహిళలను ఆప్యాయతగా పలకరిస్తూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిపాలనలో కూటమి ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులతో సంక్షేమాన్ని తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. వందలాది మంది జనం ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం వహించినారు. పార్టీ అనుబంధ సంఘాలతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉన్నారు. పసుపు జెండాలు చేత పట్టుకొని జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ సైకిల్ గుర్తుకే మీ ఓటు అంటూ ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ప్రతి ఇంటి వద్ద ఎంపీటీసీ అభ్యర్థి రేవతికి గెలుపు భరోసా కల్పించినారు. ఇంటింటి ప్రచారంలో కరపత్రం ఇవ్వడం బ్యాలెట్ నమూనా చూపెట్టి ఓటు వేసే విధానంపై ఓటర్లకు వివరించారు. ఎన్నికల ప్రచార పాటలతో ఆ వీధి కళకళలాడింది. సైకిల్ వైపు ఓటర్లు చూస్తున్నారు అనేదానికి నిదర్శనంగా ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. భారతీయ జనతా పార్టీ, జన సైనికులు కూడా ప్రచారంలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో శంభన్ వీది గ్రామస్తులు వాకాటి సుబ్బయ్య, రాగాల సురేష్ ,యువత, మండల తెలుగు యువత అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, కృష్ణపట్నం ఆలయాల చైర్మన్ మామిడాల శ్రీనివాసులు, కృష్ణపట్నం సొసైటీ డైరెక్టర్ గూడలి మధుసూదన్ రావు శర్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు కారంచేటి శివరామ ప్రసాద్ శర్మ , కరణాల వీధి టిడిపి నాయకులు తొండమనాటి వెంకటాద్రి, పెద్దపాలెం హరి ప్రసాద్, పెద్దపాలెం సురేష్ బాబు, పెద్దపాలెం రాజ , కంద స్వామి, తొండమనాటి పుల్లయ్య, కాపు నాయకులు పసుపులేటి గోవిందయ్య, యాదవ సంఘం నాయకులు కట్టా గోపి , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.