BREAKING
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ప్రజావాణిలో పురుగు మందు డబ్బాతో రైతు ఆవేదన సముద్ర జీవవైవిధ్య పరిరక్షణకు అత్యంత కీలకం 'అధోజల మహాసముద్రాలు' బహుళ వ్యవస్థా క్షీణత వ్యాధి చికిత్స పరీక్షలను నిలిపివేసిన టెవా ఫార్మాస్యూటికల్స్ ప్రజా ఫిర్యాదులపై సత్వర స్పందన.. బాధితులకు చట్టపరంగా న్యాయం చేయాలి - ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోలక్ పల్లి లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్..

పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి

Select Suryaa Now
పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి

పాలకొండ, సూర్య :  నగరపంచాయతీ,మున్సిపల్  ఎన్నికల ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళికతో కూడిన పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ  ఎస్.వి. మాధవ్ రెడ్డి తెలిపారు. పార్వతీపురం పట్టణం, పాలకొండ, సాలూరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి గుంపులు గుమిగూడకుండా, రాజకీయ పార్టీల కార్యకలాపాల వల్ల ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు సహా ప్రతి ఒక్కరికీ అవసరమైన సహకారం అందిస్తూ, వారు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణం కల్పించాలని తెలిపారు. ఎన్నికల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాలు, పరిసర ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని  పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ ఆదివారం పార్వతీపురం, సాలూరు మున్సిపల్ ఎన్నికలు అలాగే పాలకొండ నగర పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పోలీస్ శాఖ  నుంచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఉదయం  నుంచి కూడా ప్రజలు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు  ఏవిధమైన అవాంచనీయ ఘటనలు జరగకండా  సజావుగా పోలింగ్  జరుగుతుందని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 800 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.  శిక్షణ పొందిన నూతన సిబ్బంది, మహిళా సంరక్షక కార్యదర్శి మరియు ఇతర శాఖల సిబ్బంది  ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు, శాంతి భద్రత సమస్యలు ఉత్పన్నం కాకుండా అదనపు  బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆ రూట్స్ లో కూడా రూట్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్,స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్యూఆర్టి  బృందాలు ఏర్పాటు చేసి ఎటువంటి  శాంతి భద్రత సమస్యలు లేకుండా తిరుగుతూ  జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుందని, ప్రజల భద్రతకు, ఎన్నికలు సజావు నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని జిల్లా ఎస్పీ  ఎస్.వి. మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో జిల్లా ఎస్పీ తో  పాటు పాలకొండ డి ఎస్పీ ఎం. రాంబాబు, సిఐ ప్రసాదరావు, ఎస్సై వెంకన్న,పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.