BREAKING
ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోన్న ఆది సాయికుమార్ ఎస్ఐ యుగంధర్ సినిమా బీసీ కాలనీలో స్థల వివాదం.. జేసీబీతో హడావుడిగా చదును! పోలింగ్ కేంద్రం లోకి అభ్యర్థిని రానివ్వని సీఐ గంగాధర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కల్పించిన బీఆర్ఎస్ నాయకులు బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన మంత్రి లోకేష్. బాలికకు అందుతున్న చికిత్సపై వైద్యులతో చర్చించిన మంత్రి ఆత్మకూరులో జోరుగా ప్రశాంతంగా ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సీసీ రోడ్డు పనులకు ఎంపీ రఘునందన్ రావు శ్రీకారం టిపిటిఎఫ్ నూతన కమిటీ ఎన్నిక దెబ్బతిన్న రైతన్న ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం దే అంతిమ యాత్ర .... (కథ) వింజమూరులో హోరాహోరీగా ప్రచారం ఆత్మకూరులో ప్రజల నుంచి విశేష స్పందన - 28 వార్డుల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం - మంత్రి ఆనం ఎస్పీ చొరవతో వృద్ధురాలికి ఓటు వేసే అవకాశం బీజేపీ ప్రభుత్వం చేతుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మ..కాంగ్రెస్ నాయకుల ధ్వజం! ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు మేకపాటి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి.

స్వయం పాలన ఉద్యమ సారథి కుంమ్రం భీం -కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా 86వ వర్ధంతి వేడుకలు

Select Suryaa Now
స్వయం పాలన ఉద్యమ సారథి కుంమ్రం భీం -కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా 86వ వర్ధంతి వేడుకలు

కొత్తగూడ, మేజర్ న్యూస్, ఆదివాసి హక్కుల కోసం ఆదివాసి ప్రజల స్వేచ్ఛ స్వతంత్రం కోసం పోరాడి అమరుడైన గోండ్ వీరుడు కుంమ్రం భీం 86 వ వర్ధంతి కార్యక్రమాన్ని కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదివాసి ఉద్యోగ సంఘాలు ఆదివాసి ప్రజలు వర్ధంతి సందర్బంగా భీం విగ్రహానికి పూలమాలలు వేసిఘనంగానివాళులర్పించారు.అనంతరం ఆదివాసీ ఉద్యమ నాయకులుమాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో ఆదివాసి పోరాటాలు అపూర్వమైనవి అవన్నీ భూమి కోసం భుక్తి కోసం స్వయంపాలన కోసం జరిగినవి కొండ కోనల్లో ప్రకృతి తో సహజీవనం సాగించే గిరి పుత్రులు ఆదివాసీలు అడవి పై పూర్తి హక్కు కోసం వారి సామాజిక న్యాయం కోసం పోరాడారు. భారతదేశ నికి ఆంగ్లేయులు రాకపూర్వమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాల పరిధిలో కీ.శ. 1240  కీ.శ. 1749 మధ్య గొండ్వాన రాజ్యలు ఏర్పడ్డాయి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరిమేరి మండలం సాంకేపల్లి అనే గోండ్ గూడెంలో 1900 సంవత్సరంలో కుoమ్రo చిన్ను -సోంబాయి దంపతులకు  భీం జన్మించాడు. భీం చిన్నతనం నుండి జంగ్లాత్ పోలీస్ పటేదార్లు షావుకార్ల విషం కూరల్లో గోండులు ఆదివాసీలు ఏ విధంగా నలిగిపోతున్నారో చూస్తూ పెరిగి పెద్దవాడయ్యాడు. అధికారుల  దౌర్జన్యాలు షావుకారుల దోపిడీ నుండి భూమికోసం మనుగడ కోసం ఒక గ్రామం నుండి ఒక గ్రామం కు తిరిగాడు. ఆ పరిస్థితుల్లో భీం తండ్రి చిన్ను మరణించారు.భీం కుటుంబం సoకేపల్లి వదిలి ఆసిఫాబాద్, ధానోరా,సర్దాపూర్ వెళ్ళింది. అక్కడే అడవులు నరికి చదును చేసి వర్షాలు పడగానే పోడు వ్యవసాయం చేసేవారు.పంట చేతికి వచ్చే సమయానికి నిజాం పట్టేదారులు జాంగ్లాత్ వాళ్ళు సుంకారి వచ్చి భూమి మాది అని దౌర్జన్యం చేసేవారు. ఆదివాసిలు సహించలేక తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటులో సిద్ధిక్ సాబ్ కొమరం భీమ్ చేతిలో హతమయ్యాడు.కొన్నాళ్లు అస్సాం పారిపోయిన బీమ్ అక్కడ జరుగుతున్న అన్యాలపై పోరాటాలు తిరుగుబాటులపై అవగాహన పెంచుకొని చదువుకొని ఇంగ్లీష్ హిందీ ఉర్దూ భాషలు నేర్చుకొని తన జాతి పై జరుగుతున్న అన్యాలని ఎదిరించడానికి  తిరిగి తన గోండ్ గూడెం కి చేరుకున్నాడు. ఇక్కడికి వచ్చాక చూస్తే గోండ్ లపై జరుగుతున్న అన్యాలని చూస్తూ సహించలేకపోయడు.అడవిలో పుట్టాం అడవిలో పెరిగాం ఈ గాలి నీరు ఎండ వాన మనవి అయినప్పుడు ఈ అడవిలో ఉన్న సంపద మనది ఎందుకు కాదు అని 12 ఆదివాసి గూడాలని ఏకం చేసి భూ  పోరాటానికి గోండు ఆదివాసి యువకుల తో భీం గెరిల్లా సైన్యం ఏర్పాటు చేశాడు. స్వతంత్ర గోండ్ రాజ్యం కావాలని ప్రకటించాడు తుడుం మోగించి రగల్ జెండా ఎగరవేశాడు ఆకలితో బక్క చిక్కి ఉన్న గోండ్ లు ఆదివాసులు ఏమాత్రం వెనక్కి రాకుండా భీం మాటలతో భూమికోసం భుక్తి కోసం జాతి విముక్తి కోసం ప్రాణాలర్పించైన రానున్న భావితరాలకు బంగారు బాటలు వేయాల్సిందిగా భీం చెప్పిన మాటలు జల్ జంగిల్ జమీన్ హమారా మావ నాటే మావ రాజ్ అంటూ నినాదాలతో ఇచ్చిన పిలుపుతో ఆదివాసి ప్రజలు భీం గేరిళ్ల తిరుగుబాటుకు మద్దతు నిలిచారు.భీం పిలుపుతోఆదివాసీలందరూ ఏకమై నిజాం సైన్యంతో పెద్ద ఎత్తున గేరిళ్ల వార్ కొనసాగుతున్న సమయంలో నిజాం ప్రభువు  తన వక్రబుద్ధితో ఒక దొంగ ఇచ్చిన సమాచారంతో కొమరం భీమ్ ఉన్న సమాచారాన్ని తెలుసుకొని అక్కడికి తన సైన్యాన్ని పంపించి ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా కొమరం భీం మరియు అతని సైన్యంపై ఎదురు కాల్పులు జరపడం తో హోరా హోరీగా జరిగిన ఏదురుకాల్పుల్లో భీం తో సహా మరి కొంతమంది ఆదివాసులు ఎదురు కాల్పుల్లో వీరమరణం చెందడు. కొమరం భీమ్ అంటే ఒక్క పోరాట యోధుడు మాత్రమే కాదు ఆదివాసుల స్వేచ్ఛా  గీతం జాతి స్వేచ్ఛ కోసం జల్ జంగిల్ జమీన్ కోసం తుడుo మోగించి ఎదురు తిరిగి అసలు బాసిన ఆదివాసి యోధుడు కొమరం భీమ్ ను ఆదివాసీ లు స్మరించుకుంటూ ప్రతి ఏట అశ్వయుధ శుద్ధ పౌర్ణమి రోజున  జోడేగడ్ తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటారు కుంమ్రం భీం మరణం తర్వాత  ఆస్ట్రియా దేశస్థుడైన ప్రముఖ ఆంత్రో పాలజిస్ట్ హైమాన్ డార్ఫ్ నీ నిజాం తన నూతన రహస్య వర్తకుడిగా నియమించుకున్నాడు భీం పోరాటం తర్వాతనే గోండ్ ఆదివాసుల బ్రతుకుల్లో వెలుగులు నిండాయి.కార్యక్రమం లో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు కుంజ నరసింగరావు, పూనేం సందీప్ కుమార్,మల్లెల సారయ్య,పొనక ప్రకాష్, వట్టం నిశాంత్, కల్తీ సురేందర్, మల్లెల రమేష్,సిద్దబోయిన భద్రయ్య, సిద్దబోయిన కిషోర్, తాటి సుదర్శన్, మంకిడి ఉపేందర్,ఈక నగేష్,తాటి అనిల్, సిద్దబోయిన సతీష్,ముయ్యబోయిన నరేష్,కల్తీ నరేష్ ఆదివాసీ సేన, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య,  సర్పంచ్ లు మల్లెల భాగ్యమ్మ,దనసరి ముత్తయ్య, గొంది రాజు,బంగారి నరేష్ పటేల్ సిద్దబోయిన వీరాస్వామి, బి ఆర్ఎస్ పార్టీ నాయకులు, ఈసం స్వామి ఆదివాసీ ఉద్యోగులు చుంచ సారయ్య,వాసం నర్సయ్య,వట్టం సాయిలు,వాసం కిషేందర్, బంగారి ఆదిలక్ష్మి,అలెం సాంబయ్య తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

రిపోర్టర్; దేసు వెంకటేశ్వర్లు ;కొత్తగూడ, మహబూబాబాద్ జిల్లా