BREAKING
మన పేగుల్లో కోట్లాది మంచి బ్యాక్టీరియా.. వాటిని సురక్షితంగా కాపాడుకోవడం ఎలా బాధిత కుటుంబానికి ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చేయూత పొలమూరులో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం. ప్రభుత్వ వ్యతిరేక విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయి వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ పరిశీలకులు పాటి శివకుమార్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఐదు చెడ్డ ఆహారపు అలవాట్లు ఇవే.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. చిర్ల జగ్గిరెడ్డి చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం నుండి ఎన్నికల ప్రచారం. పెరవలి మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచార జోరు ఆర్నాబ్ తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం - ప్రజా సమస్యలను వివరిస్తూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కాకరపర్రులో మీ మార్ట్‌ను ప్రారంభించిన తహసీల్దార్ కే. నిరంజన్ మోహన్‌లాల్ 'అతిమనోహరం' ఫస్ట్ సింగిల్ విడుదల.. ఎంజీ శ్రీకుమార్ కాంబో మళ్లీ రిపీట్ పుర పోరులో ఎన్డీఏ కూటమిదే విజయం పోగొట్టుకున్న మొబైల్ అందజేత

విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

Select Suryaa Now
విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

విద్యుత్ షాక్‌తో యువ ఎలక్ట్రిషియన్ మృతి.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::

ఇన్వర్టర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి యువ ఎలక్ట్రిషియన్ మృతి చెందిన ఘటన దుమ్ముగూడెం మండలం జరిగింది.ఈ ప్రమాద సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని బైరాగులపాడు గ్రామానికి చెందిన వాసం సన్వంత్ దొర (సన్నీ 26) తండ్రి నర్సింహారావుతో కలిసి ప్రైవేట్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు.మండలంలో ఏ ఇంట్లో కరెంట్ సమస్య వచ్చినా వెంటనే వెళ్లి పరిష్కరించే సన్నీకి అందరితోనూ మంచి పేరుంది.ఈ క్రమంలోనే శనివారం లక్ష్మీనగరం గ్రామంలోని ఓ ఇంట్లో ఇన్వర్టర్ బాగుచేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురై సన్నీ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.ప్రమాదం జరిగిన వెంటనే ఇంటి యజమానులు సరిగా స్పందించలేదనిమెయిన్ ఆఫ్ చేసి ఉంటే ప్రమాదం తప్పేదని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దాదాపు 15 నిమిషాల పాటు సన్నీ కరెంట్ షాక్‌తోనే కొట్టుకున్నాడని యజమాని నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని మండిపడ్డారు.సన్నీ మృతదేహాన్ని ఆ ఇంటి ముందే ఉంచి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.సన్నీ ఆకస్మిక మృతితో బైరాగులపాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సూర్య రిపోర్టర్.. సుమన్