BREAKING
ఎంపీపీ ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాలి జాతీయస్థాయి కరాటే పోటీల్లో డ్రీమ్స్ విజయ బావుటా బ్యాటరీ స్క్రాప్ నుండి విలువైన ఖనిజాలను వెలికితీయడం భారత్‌కు ఎందుకు సవాలుగా మారుతోంది? మాదక ద్రవ్యాలు వాడకం వల్ల యువతకు అనేక రుగ్మతలు కొనితెచ్చుకుంటున్నారు... .ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి పద్మావతి. వెటర్నరీ వర్సిటీలో అంతర్జాతీయ సదస్సు -హాజరుకానున్న దేశీయ, అంతర్జాతీయ పశువైద్య నిపుణులు -మీడియా సమావేశంలో వీసీ వైకుంఠరావు గరుగుబిల్లి సర్పంచ్‌గా ఎడ్ల శాంతి ఏకగ్రీవం బడ్జెట్ 2027: ఎల్‌టీసీజీ తగ్గింపు, ఎస్‌టీటీ ఉపశమనం.. ఉల్లిభద్ర సర్పంచ్‌గా మరడాన వాసవికుమారి ఏకగ్రీవం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం లేడీ సూపర్ స్టార్ నయనతారకు భర్త విగ్నేష్ శివన్ ఎమోషనల్ బర్త్‌డే విషెస్: నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్ వైస్ ఎంపీపీ పదవిని జనసేన కేటాయించాలి తుఫాను ముందస్తు జాగ్రత్తలపై రైతులకు అవగాహన నవజాత శిశువుల ఆరోగ్యం, సంరక్షణ పై శ్రద్ధ వహించాలి జిందాల్ స్టీల్ నుండి ఎన్‌ఎండీసీ వరకు: క్యూ2 ఫలితాల తర్వాత మెటల్స్, మైనింగ్ రంగంలో సిస్టమాటిక్స్ టాప్ స్టాక్ పిక్స్ ఇవే.. టార్గెట్ ధరలు చెక్ చేయండి! నేడే"మరడాన"పట్టాభిషేకం.. ఎంపీపీగా బాధ్యతల స్వీకరణ!

విద్యార్థుల బియ్యంపై నైట్ వాచ్ మెన్ కన్ను...!

Select Suryaa Now
విద్యార్థుల బియ్యంపై నైట్ వాచ్ మెన్ కన్ను...!

దంతాలపల్లి, మేజర్ న్యూస్,
దంతాలపల్లి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అందించాల్సిన బియ్యం అక్రమ తరలింపు వ్యవహారం కలకలం రేపింది. విద్యార్థుల ఆహార అవసరాల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యానికి కాపలాగా ఉండాల్సిన నైట్‌ వాచ్‌మెనే వాటిని తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో నైట్‌ వాచ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న బుగ్గ రవీందర్‌ మంగళవారం రాత్రి పాఠశాలకు చెందిన బియ్యాన్ని వాహనంలో తరలిస్తుండగా పోలీసులు గుర్తించి పట్టుకున్నట్లు తెలిసింది. సుమారు 22 క్వింటాళ్ల బరువున్న 44 బస్తాల బియ్యాన్ని తరలిస్తున్న సమయంలో పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి నైట్‌ వాచ్‌మెన్‌ రవీందర్‌పై కేసు నమోదు చేసినట్లు, బియ్యం తరలింపునకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై రవికుమార్‌ తెలిపారు.విద్యార్థులకు అందాల్సిన ఆహార ధాన్యాలు అక్రమంగా తరలింపు వ్యవహారంలో పట్టుబడటంతో పాఠశాల సరుకుల నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బియ్యం నిల్వలు, వాటి పంపిణీ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం జరిగిందా? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి అక్రమ తరలింపులో భాగస్వాములైన వారెవరైనా ఉంటే వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

రిపోర్టర్; రాములు ,దంతాలపల్లి, మహబూబాద్ జిల్లా