BREAKING
జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ....4 ఎంపీటీసీలు వైసీపీ, 12 ఎంపీటీసీలు టీడీపీ, జనసేన రెండు .... నెల్లూరు రూరల్ మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ప్రభంజనం రాపూరు బిట్-1లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏటూరు మురళీమోహన్ రెడ్డి ఘన విజయం న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకోండి మండల న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్. ప్రజల జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ పర్యావరణ పరిరక్షణ - సహజ వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత బ్రాహ్మణపల్లిలో ఇక టీడీపీ జెండానే..! మంత్రి ఆనంకు తొలి బహుమతి కావలిలో ఒక రోజు ముందుగానే దీపావళి సందడి..! మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు.. మాకెందుకు నిధులు రావు:మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం! పాచిపెంట మండలం ఎంపీపీ పదవి గూడెపు యుగంధర్ కైవసం అద్దంకి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం. 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 12 కైవసం. జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధే మా సర్కార్ ధ్యేయం : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బాడంగిలో టీడీపీ విజయభేరి!

వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీహరి రావు :

Select Suryaa Now
వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీహరి రావు :

వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ గా బాధ్యతలు స్వీకరించిన జువ్వాడి నర్సింగరావుకు శుభాకాంక్షలు తెలిపిన 
నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు.

2. సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. :
తెలంగాణ తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జువ్వాడి నర్సింగరావును కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శ్రీహరిరావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వెలమ కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వెలమ సామాజిక వర్గానికి న్యాయం చేసే ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తరహాలో వెలమ కులానికి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. నూతన చైర్మన్ జువ్వాడి నర్సింగరావు నాయకత్వంలో వెలమ సామాజిక వర్గంలోని మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహకారం అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు.