BREAKING
నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్ మెలియాపుట్టి జడ్పీటీసీగా బమ్మిడి చామంతి ఘన విజయం దీపావళి ఆనందంగా జరుపుకోవాలి... జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కొత్తూరు జడ్పిటిసి గా టిడిపి అభ్యర్థి లోతుగెడ్డ శ్రీదేవి గెలుపు

బాడంగిలో టీడీపీ విజయభేరి!

Select Suryaa Now
బాడంగిలో టీడీపీ విజయభేరి!

బాడంగి, సూర్య : బాడంగి మండలంలో ఈ నెల 5న నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం బొబ్బిలి పట్టణంలోని ప్రభాకర్ పాఠశాలలో ప్రశాంతంగా ముగిసింది. మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు, జనసేన ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో విజయం సాధించారు. టీడీపీ తరఫున గొల్లాది, గజరాయునివలస, డొంకినవలస, వీరసాగరం, గూడెపువలస, వాడాడ, కోటిపల్లి, బొత్సవానివలస స్థానాల్లో అభ్యర్థులు గెలుపొందారు. వైసీపీ తరఫున బాడంగి, కోడూరు-1, కోడూరు-2, పాల్తేరు స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారు. ముగడలో జనసేన అభ్యర్థి గెలుపొందగా, రేజేరులో  స్వతంత్ర అభ్యర్థి గొట్టాపు సుభాషిణి సుమారు 92 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం. పలు స్థానాల్లో ఆసక్తికర ఫలితాలు నమోదయ్యాయి. ముగడలో జనసేన అభ్యర్థి సుమారు 1,151 ఓట్ల మెజారిటీతో, గొల్లాదిలో టీడీపీ అభ్యర్థి బంటు అర్జున్ సుమారు 1,080 ఓట్లతో, గజరాయునివలసలో గుణుపూరు కృష్ణకుమారి సుమారు 1,050 ఓట్లతో గెలుపొందారు. కోడూరు-1లో వైసీపీ అభ్యర్థి కండి తవిటయ్య కేవలం నాలుగు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించగా, వీరసాగరంలో టీడీపీ అభ్యర్థి ఆవు సత్యనారాయణ సుమారు 36 ఓట్లతో గెలుపొందారు. బాడంగిలో వైసీపీ అభ్యర్థి కండి ధన సుమారు 240 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి కండి ప్రతిమకు నాలుగు రౌండ్లు పూర్తయ్యే సమయానికి నాలుగు వేలకుపైగా ఓట్ల ఆధిక్యం ఉన్నట్లు సమాచారం. మొత్తంగా బాడంగి మండల పరిషత్‌లో టీడీపీ అత్యధిక ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని బలమైన స్థానాన్ని సంపాదించింది. ఈ ఫలితాలతో ఎంపీపీ పీఠంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. ఎంపీపీ ఎన్నికలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.