*వస్తున్న మీకోసం.. కార్యక్రమం*
ఆత్మకూరు /మేజర్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారికి 2012, అక్టోబర్ 2 న ప్రజా సమస్యల కోసం తెలుసుకునేందుకు ఆనాడు వస్తున్న మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అదే స్ఫూర్తితో 14 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు , బక్కని నరసింహులు పేర్కొన్నారు. గురువారం మల్లాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించే పట్టణంలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పార్టీ నిర్ణయించే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ కన్వీనర్ దివాన్జి అశోక్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు జూరాల తిరుపతయ్య గౌడ్, ఖా లచ్చన్న గౌడ్, ఎస్టిడి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ అభిమానులు దయాకర్ రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.