రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, చండ్రుగొండ మండలంలోని సీతాయిగూడెం గ్రామంలో జరుగుతున్న భూముల రీ సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే బృందాల పనితీరును పరిశీలించి పరికరాలతో సర్వే అత్యంత ఖచ్చితత్వంతో చేయాలని ఆదేశించారు. ఎక్కడ తప్పులు జరగకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సర్వేయర్లకు సూచించారు. గ్రామంలోని రైతులతో మాట్లాడి సర్వే ప్రయోజనాలు వివరించి, సర్వే తర్వాత ప్రతి రైతుకు పక్క హద్దులతో కూడిన భూహక్కు పత్రాలు వస్తుందని, రీ సర్వే అనేది రైతుల భూములకు శాశ్వత భద్రత కల్పించే కార్యక్రమాన్ని, రైతులంతా సహకరించాలని కోరారు. ఆయన వెంట సర్వే అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, రైతులు, తదితరులున్నారు.