BREAKING
ఇంకుడు గుంతల వల్ల భూమిలో నీటి నిల్వ పెరుగుతుంది - ఎంపీడీవో తాహీరా బేగం ఫోక్స్ అవగాహన కార్యక్రమం ఎల్ వి ప్రసాద్ లో డయాబెటిక్ రెటినోపతి పై అవగాహన ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ 31 నుండి గీతంలో సౌత్ జోన్ ఇంటర్-యూనివర్సిటీ పురుషుల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ పోటీలు వ్యవసాయ పరిశోధనలకు భారత్ లో ప్రతిష్టాత్మక ఐకార్-సీజీఐఏఆర్ సైన్స్ అండ్ పార్టనర్‌షిప్ వీక్‌ నిర్వహణ! ఆస్కార్ అర్హత సాధించిన 'వి వర్ హియర్' షార్ట్ ఫిల్మ్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జతకట్టిన ప్రియాంక చోప్రా! ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు గ్రామాల్లో విస్తృత పర్యటన పిల్లలను కట్టిపడేస్తున్న యానిమేటెడ్ బ్యాక్‌గ్రౌండ్స్ సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి,సీనియర్ సివిల్ జడ్జి గోపిక నాగ శ్రావ్య తప్పిపోయిన ప్రైవేట్ హెలికాప్టర్.. రంగంలోకి దిగిన సైన్యం, ఎస్డీఆర్‌ఎఫ్ రెస్క్యూ బృందాలు! పేలవంగా సాగిన మండల సర్వసభ్య సమావేశం! బనస్కాంతలో రూ.14 వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం

ఈవీఎం గో డాన్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

Select Suryaa Now
ఈవీఎం గో డాన్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంల) భద్రత, పర్యవేక్షణ ఏర్పాట్లను నిరంతరం పరిశీలించడంలో భాగంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం రాజమహేంద్రవరంలోని ఎఫ్‌సీఐ గోడౌన్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్‌లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, వాటి ద్వారా నిరంతరం పర్యవేక్షణ జరుగుతున్న తీరును ఆమె పరిశీలించారు. గోడౌన్ పరిసరాల్లో భద్రతా చర్యలు, సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పనితీరుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఈవీఎంల భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు.ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో, గోడౌన్‌లో భద్రతా ప్రమాణాలను నిరంతరం పాటిస్తూ, పర్యవేక్షణ వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని  తెలిపారు.తనిఖీలో సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, డిప్యూటీ తహసీల్దార్ వి. శ్రీనివాస్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.