ఫోక్స్ అవగాహన కార్యక్రమం
ఆత్మకూరు /మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా అమరచింత మండలం పామిరెడ్డి పల్లె గ్రామ శివారులోని కేజీబీవీ పాఠశాల నందు శుక్రవారం ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి శిరీష ఆధ్వర్యంలో ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలురు బాలికలను లైంగిక వేధింపులు లైంగిక దాడి అసలైనది రక్షించడానికి భారతదేశంలో రూపొందించబడిన ఒక ప్రత్యేక చట్టం ఫోక్సో పెట్టమని జూనియర్ సివిల్ జడ్జ్ శిరీష తెలిపారు. ఈ చట్టం 2012 నవంబర్ 14 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి, సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.
_రాజారత్నం, ఆత్మకూరు వనపర్తి జిల్లా.