BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఉద్యోగులకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ప్రతిపాదనలు పంపిస్తాం - కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ

Select Suryaa Now
ఉద్యోగులకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలుకు ప్రతిపాదనలు పంపిస్తాం - కలెక్టర్ చిత్రా మిశ్రా హామీ
సూర్య కరీంనగర్ : నగరపాలక సంస్థ పరిధికి 8 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెచ్‌ఆర్‌ఏను తిరిగి 11 శాతం నుంచి 17 శాతానికి పెంచాలని కోరుతూ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు కలెక్టర్‌ను కలిసి ఉద్యోగులకు జరుగుతున్న ఆర్థిక నష్టాన్ని వివరించారు. గతంలో సర్వే ఆధారంగా 21 గ్రామాలకు 17 శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం తిరిగి 11 శాతానికి తగ్గించారని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ రాటిఫికేషన్ కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.