గుంటూరు: కార్పొరేషన్ ఎన్నికలలో ఎంతమంది పోలీసులు, ఇతర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారో తెలుసా!!!
నవంబర్ 1వ తేదీ నిర్వహించే గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ రోజున 3,576 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ వెల్లడించిన సమాచారం మేరకు పోలింగ్ రోజున 1500 మంది పోలీసులు, 2000మంది జీఎంసీ అధికారులు,సిబ్బంది,27 మంది ఆర్వోలు,77 మంది ఏఆర్వోలు,13 మంది జోనల్ అధికారులు,61 మంది రూట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు.కౌంటింగ్ తేదీ రోజున 50 హాల్స్ లో 468 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2,160 మంది లెక్కింపు సిబ్బంది విధులలో పాల్గొననున్నారు.ANU లోని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేయనున్నారు.
అనిల్ కాంత్.కె ....గుంటూరు ప్రతినిథి