బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తూ కవిత గారి నిర్ణయం అభినందనీయం – కడెం అర్చన
కల్వకుంట్ల కవిత నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. సనత్‌నగర్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తనకు బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి కడెం అర్చన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత, సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే అభిప్రాయాలు వివిధ రాజకీయ నాయకుల నుంచి వ్యక్తమవుతున్న తరుణంలో, తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు మూడు నియోజకవర్గాల ఇన్‌చార్జ్ బాధ్యతలను బీసీ నాయకులకు అప్పగించడం స్వాగతించదగిన నిర్ణయమని కడెం అర్చన పేర్కొన్నారు.
బీసీలకు కేవలం మాటల్లోనే కాకుండా రాజకీయ బాధ్యతలు, నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా వారి రాజకీయ ఎదుగుదలకు ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. కవిత గారు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఆమె మార్గదర్శకత్వంలో సనత్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటానని, మహిళలు, యువత, పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ముఖ్యంగా బీసీల అభ్యున్నతికి, వారి హక్కులు, అవకాశాల సాధనకు తన వంతు కృషి చేస్తానని, సనత్‌నగర్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతానని తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతను పదవిగా కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశంగా భావిస్తూ, కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సనత్‌నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని కడెం అర్చన స్పష్టం చేశారు.