నాయిని జలాల్పూర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ..
కొల్చారం;నిరుపేదలకు, గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ అన్నారు.ఆయన ఆధ్వర్యంలో శుక్రవారం కొల్చారం మండలంలోని నాయిని జలాల్పూర్ గ్రామంలో సర్పంచ్ దేవి సింగ్ అధ్యక్షతన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇల్లు నిర్మించుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.స్థానిక ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు.అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులను లబ్ధిదారులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శ్రీనివాస్ చారి, హౌసింగ్ ఏఈ సుష్మ, పంచాయతీ కార్యదర్శి మౌనిక, జీపీఓ పద్మ, ఉపసర్పంచ్ వెంకట నరసింహులు, చిన్న గణపురం సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు యేసు రాజు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మయ్య, మండల నాయకులు రాయన్న, రాములు, మాజీ ఉపసర్పంచ్ గొల్ల వనజ పాండరి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు చిత్తారి సంతోషిని భాస్కర్, గంగ స్వామి, దుర్గయ్య, ప్రసాద్, రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ సత్యనారాయణ, యువ నాయకులు వడ్ల గణేష్, చిత్తారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.