BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

జీన్ హెన్రీ డ్యూనాంట్‌కు రెడ్ క్రాస్ ఘన నివాళి

Select Suryaa Now
జీన్ హెన్రీ డ్యూనాంట్‌కు రెడ్ క్రాస్ ఘన నివాళి

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30-10-2026 తేదీన రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు శ్రీ జీన్ హెన్రీ డ్యూనాంట్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ అడ్ హాక్ మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు బ్లడ్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీ చమర్తి జనార్ధన్ రాజు  పూలమాల వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా శ్రీ చమర్తి జనార్ధన్ రాజు  మరియు రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. వరప్రసాద్  మాట్లాడుతూ, జీన్ హెన్రీ డ్యూనాంట్  మానవతా విలువలకు ప్రతీకగా నిలిచారని తెలిపారు. 1859లో జరిగిన సోల్ఫెరినో యుద్ధంలో గాయపడిన సైనికులకు కుల, మత, దేశ భేదాలు లేకుండా వైద్య సహాయం అందించేందుకు ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. యుద్ధంలో గాయపడిన వారికి రక్తం, వైద్య సహాయం వంటి అత్యవసర సేవల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన ఆయన మానవతా సేవా స్ఫూర్తి రెడ్ క్రాస్ ఉద్యమానికి పునాదిగా నిలిచిందన్నారు. ఆయన ఆశయాలు, సేవా స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థలు రక్తదానం, రక్త సేకరణ, వైద్య సహాయం, విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడటం కూడా మానవతా సేవలో అత్యంత గొప్పదని, ప్రతి ఒక్కరూ రక్తదానంపై అవగాహన కలిగి స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జీన్ హెన్రీ డ్యూనాంట్ జీవితం ప్రతి ఒక్కరికీ సేవాభావం, మానవత్వం పట్ల స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.  ఈ కార్యక్రమంలో MSR స్పాస్టిక్స్ సెంటర్ ప్రిన్సిపల్ శ్రీ ఉదయ్ భాస్కర్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీ డి. సుందర రాజు, మోటివేటర్లు శ్రీ సాయిరాం, శ్రీ భాస్కరరావు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.