రాజకీయాల కతీతమైన సంక్షేమ, అభివృద్ధి వైఎస్ఆర్సిపి తోనే సాద్యం
రాజకీయాల కతీతమైన సంక్షేమ, అభివృద్ధి వైఎస్ఆర్సిపి తోనే సాద్యం
వైయస్సార్సీపి ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల
పట్టణంలోని 15,16,17 వార్డులలో చైర్మన్ అభ్యర్థి షేక్ నాగూర్ మీరాన్ తో కలిసి విస్తృత ప్రచారంలో పాల్గొన్న డాక్టర్ గజ్జల
సత్తెనపల్లి, న్యూస్ : రాజకీయాల కతీతమైన సంక్షేమం అభివృద్ధి వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని అనుభవజ్ఞుడైన నాగుల్ మున్సిపల్ చైర్మన్ గా గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ కోరారు.శుక్రవారం పట్టణంలోని 15,16,17 వార్డులలో నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, చైర్మన్ అభ్యర్థి షేక్ నాగూర్ మీరాన్ తో కలిసి విస్తృత ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిమ్మకాయల మాట్లాడుతూ... పారదర్శక అభివృద్ధి జరగాలన్న, ప్రతి వార్డుకు త్రాగు నీరు, పారిశుద్ధ్యం, మౌలిక వసతులు సకాలంలో మీకు చేరువవాలన్నా సీనియర్ నాయకులు సుపరిచితులు షేక్ నాగూర్ మీరాన్ , కౌన్సిలర్ అభ్యర్థులు కాటేపల్లి శ్రీదేవి_లోక కళ్యాణి,మద్ది బోయిన సుమలత ల ను సీలింగ్ ఫ్యాను గుర్తు పై మీ ఓటును వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరారు.