ముగిసిన కాకి గంగరాజు ప్రచార ర్యాలీ
ఆరిలోవ, సూర్య : జీవీఎంసీ,14 వ వార్డు టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి కాకి గంగ రాజు ఎన్నికల ప్రచారం చివరి రోజు కావడంతో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలతో కలసి వార్డు పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. 1వ తేదీన జరగబోవు జీవీఎంసీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి కి,14వ వార్డు కార్పొరేట్ అభ్యర్థి కాకి గంగరాజు కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు జోరు వానలో కాకి గంగరాజు పై అభిమానంతో స్వచ్ఛందంగా ప్రచారంలో పాల్గొన్నారు.